సభలో విజయ సాయి రెడ్డి వ్యాఖ్యల దుమారం!

వాస్తవం ప్రతినిధి: రాజ్యసభలో వైసీపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఒకపక్క కరోనా మహమ్మారిపై చర్చ జరుగుతున్న సందర్భంగా దానిపై మాట్లాడకుండా వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి కోర్టులపై వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. సభ లో కరోనా గురించి చర్చజరుగుతున్న సమయంలో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై కోర్టులు స్టేలు విధిస్తున్నాయని, రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేయడం విశేషం. అంతేకాకుండా తమ ప్రభుత్వంపై పక్షపాత ధోరణితో కోర్టు లు వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో విజయసాయి రెడ్డి సభ సాక్షిగా కోర్టులపై వ్యాఖ్యలు చేస్తుండడం తో డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. సబ్జెక్ట్ దాటి మాట్లాడుతున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా విజయసాయి ఏమాత్రం పట్టించుకోకుండా తన ధోరణిలో మాట్లాడుతూ పోయారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యుడు కనకమేడల కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టు పరిధిలో ఉన్న అంశాల గురించి పార్లమెంటులో మాట్లాడటం దారుణమని అన్నారు. కోర్టులను కూడా బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే డిప్యూటీ చైర్మ న్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ వైసీపీ ఎంపీ మాత్రం తన ధోరణి లోనే మాట్లాడడం తో తీవ్ర దుమారం రేగింది. టీడీపీ నేతలు అయితే కరోనా గురించి మాట్లాడకుండా, ఇతర అంశాల గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై సీఎం జగన్ అన్న ఎలా స్పందిస్తారో చూడాలి.