అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. సర్వే ఫలితాల్లో జో బైడెన్‌ టాప్..!!

వాస్తవం ప్రతినిధి: అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ అమెరికన్ల నాడి తెలుసుకోవడానికి ప్రవాసులకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ, ఏఏపీఐకి చెందిన సంస్థ సంయుక్తంగా ఓ సర్వే నిర్వహించాయి. ఆ సర్వే ఫలితాలను తాజాగా వెల్లడించాయి. దీని ప్రకారం.. రాబోయే ఎన్నికల్లో 66శాతం మంది ఇండియన్ అమెరికన్లు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు ఓటేయనున్నారు. 28శాతం మంది.. ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ వైపు మొగ్గు చూపారు. ఇక మిగిలిన 6 శాతం మంది మాత్రం.. ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ట్రంప్‌తో పోలిస్తే.. 70శాతం ఓట్లతో జో బైడెన్ ఆధిక్యం ఉన్నట్లు సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.