జో బైడెన్‌‌కు చెందిన ఓ వీడియోను రీట్వీట్ చేసిన ట్రంప్..!!

వాస్తవం ప్రతినిధి: డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ తన పనితీరు మెరుగుపడేందుకు డ్రగ్స్ తీసుకుంటున్నారని ఇటీవల ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా జో బైడెన్‌‌కు చెందిన ఓ వీడియోను రీట్వీట్ చేసారు ట్రంప్.

జో బైడెన్ ఫ్లోరిడా ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలో తన ఫోన్‌‌ను బయటకు తీసి డెస్పసీటో అనే ప్రముఖ హాలీవుడ్ సాంగ్‌ను ప్లే చేశారు. అయితే కొంతమంది డెస్పసీటో పాటను ఎడిట్ చేసి ఆ పాటకు బదులు పోలీసులకు వ్యతిరేకంగా ఉండే ఓ నిరసన పాటను జో బైడెన్ ప్లే చేస్తున్నట్టుగా ఎడిటింగ్ చేసి ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇక ఇదే పోస్ట్‌ను ట్రంప్ రీట్వీట్ చేసి ఏంటిది అంటూ పోస్ట్‌పై రాసుకొచ్చారు. ఈ విషయాన్ని వెంటనే గుర్తించిన ట్విటర్ సంస్థ ట్రంప్ రీట్వీట్ చేసిన వీడియో తారుమారు(మ్యానిపులేటెడ్ మీడియా) చేసినది అని మార్క్ చేసింది.