అమెరికా ఎన్నికల్లో విదేశీ హ్యాకర్లు.. ట్రంప్‌ ప్రభుత్వానికి మైక్రోసాఫ్ట్‌ హెచ్చరికలు ..!!

వాస్తవం ప్రతినిధి: అమెరికా ఎన్నికల్లో విదేశీ హ్యాకర్లు తలదూర్చే ప్రమాదముందంటూ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ హెచ్చరించింది. ప్రధానంగా రష్యా, చైనా, ఇరాన్‌ల నుంచి ఎన్నికలకు ముప్పు పొంచి ఉందంటూ హెచ్చరికలు జారీ చేసింది. ట్రంప్‌ మళ్లీ గెలవాలని రష్యా కోరుకుంటే, కచ్చితంగా ట్రంప్‌ ఓడిపోవాలన్నది చైనా, ఇరాన్‌ ఆశ. 2016 తరహాలో ఈ సారి కూడా అమెరికా ఎన్నికల్లో విదేశీ హ్యాకర్లు రంగంలోకి దిగినట్టు ట్రంప్‌ ప్రభుత్వానికి మైక్రోసాఫ్ట్‌ హెచ్చరికలు పంపింది. ఇప్పటికే విదేశీ హ్యాకర్లు రంగంలోకి దిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. డొనాల్డ్‌ ట్రంప్‌, బైడెన్‌ ప్రచారంపై సైబర్‌ రాడార్‌ పెట్టారని, 200 కంపెనీల సాయంతో రష్యా హ్యాకింగ్‌ చేస్తోన్నట్టు మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది.