125 కోట్లు మోసగించిన కేసులో ఎన్నారై అరెస్ట్..!!

వాస్తవం ప్రతినిధి: అమెరికాలో బ్యాంకుకు లక్షల కోట్ల డాలర్లు మోసగించిన కేసులో ఓ ప్రవాస భారతీయడ్ని దోషిగా తేల్చింది అగ్రరాజ్య న్యాయస్థానం. న్యూజెర్సీకి చెందిన మార్బుల్, గ్రానైట్ హోల్‌సేల్ వ్యాపారి రాజేంద్ర 17 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.125 కోట్లు) రుణానికి సంబంధించి బ్యాంకును మోసం చేసే ప్రయత్నాల్లో తన పాత్రను అంగీకరించినట్లుగా యూఎస్ అటార్నీ తెలిపారు.

ఓ అమెరికన్ బ్యాంకు నుంచి అక్రమంగా రుణం పొందడానికి నాలుగేండ్ల క్రితం 2016 మార్చి నుంచి 2018 మార్చి మధ్య కాలంలో తన ఉద్యోగుల సహకారంతో ప్లాన్ చేశారు. రుణాలు పొందేందుకు తగినన్ని స్థిరాస్తులు లేకపోవడంతో సంస్థలోని ఉద్యోగుల సహకారంతో ఆన్‌లైన్ మోసానికి పాల్పడ్డాడు. ఇందులో భాగంగా సంస్థ ఉద్యోగులే తమ వినియోగదారులంటూ వారి పేరు మీద నకిలీ ఈ-మెయిల్ ఖాతాలను తెరిచారు. సంస్థను గురించి, బ్యాంకు, ఆడిటర్లకు తాము ఈ సంస్థకు భారీ మొత్తాలు బకాయి ఉన్నామని, వాటిని త్వరలో చెల్లిస్తామని పేర్కొన్నారు.

ఇది వాస్తవం అని భావించిన బ్యాంకు ఆ సంస్థకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేసింది. ఈ ట్రాన్సాక్షన్స్ వల్ల బ్యాంకుకు 17 మిలియన్ డాలర్ల నష్టం సంభవించిందని అమెరికా కోర్టులో రుజువైంది. ఈ నేరానికి గాను అతనికి గరిష్టంగా 30 ఏండ్ల జైలు శిక్ష, 1 మిలియన్ డాలర్ల జరిమానాను విధించే అవకాశాలు ఉన్నాయి.