కరోనాతో కేరళ నర్సు మృతి!

వాస్తవం ప్రతినిధి: ఒమన్‌లో కేరళకు చెందిన ఓ నర్సు కరోనా కారణంగా మృతి చెందింది . కేరళకు చెందిన 37ఏళ్ల బ్లెస్సీ థామస్.. ఒమన్‌లోని ఓ ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె.. వైరస్ బారినపడ్డారు. కాగా.. ఐసీయూలో చికిత్స పొందుతూ మంగళవారం ఆమె మృతి చెందారు. ఆమె మృతిపై ఆ దేశ ఆరోగ్యశాఖ స్పందించి, సంతాపం తెలిపింది. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.