భిక్షాటన చేపట్టిన షకలక శంకర్..!!

వాస్తవం సినిమా: జబర్దస్త్ కామెడీ షో లో అద్భుతమైన స్కిట్ లు వేస్తూ ఎంతో మందిని అలరించిన షకలక శంకర్ తాజాగా కరీంనగర్ వీధుల్లో భిక్షాటన చేశారు. కరోనా వైరస్ వలన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న కుటుంబాలను ఆదుకోవడానికి షకలక శంకర్ చేపట్టిన ఈ కార్యక్రమానికి కరీంనగర్ వాసులు 90,000 అందజేయగా వాటికి శంకర్ 10,000 కలిపి మొత్తం లక్ష రూపాయలను ఏడు కుటుంబాలకు సహాయార్థం చేశారు.

గతంలోనూ లాక్ డౌన్ సమయంలో అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న శంకర్ తాజాగా కరోనా చేత బాధపడుతున్న పేదవాళ్ళనూ ఆదుకోవడం కోసం భిక్షాటన చేపట్టడంతో ప్రజలంతా శంకర్ ని మెచ్చుకుంటున్నారు. గతంలో జబర్దస్త్ కామెడీ షో లో వరుస కిట్లతో అలరించిన శంకర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. ఒకపక్క సినిమా ఇండస్ట్రీలో రాణిస్తూనే మరోపక్క సేవా కార్యక్రమాలు చేస్తూ తన వంతుగా సమాజానికి షకలక శంకర్ ఉపయోగపడుతున్నారు.