కోర్టును ఆశ్రయించిన రకుల్ ప్రీత్ సింగ్..!!

వాస్తవం సినిమా: సుశాంత్ సూసైడ్ కేసులో డ్రక్స్ కోణం బయటపడటంతో పాటు తన పేరు రావటంతో రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. మీడియాలో తనపై కథనాలు రాకుండా నిలిపివేయాలంటూ సమాచార ప్రసారాల శాఖ కు ఆదేశాలు ఇవ్వాలని కోర్టుని విన్నవించుకుంది. ఈ సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను పిటిషన్లో పేర్కొంది. శుసాంత్ సూసైడ్ కేసులో తన పేరు డ్రక్స్ విషయంలో బయటకు వచ్చిందని దీంతో మీడియా తనకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేయడం ప్రారంభించింది అంటూ పిటిషన్లో పేర్కొంది.

ఇదిలా ఉండగా రియా చక్రవర్తి తన స్టేట్‌మెంట్‌ను ఉపసంహరించుకున్నారని తెలిసికూడా మీడియా వ్యతిరేక వార్తలతో నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారని రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొంది.
జస్టిస్ నవీన్ చావ్లా ధర్మాసనం రకుల్ పిటిషన్ ను స్వీకరించింది. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు సపోర్ట్ చేస్తూ వస్తున్న మీడియా కథనాలను అరికట్టడానికి సంబంధిత ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు ఢిల్లీ హైకోర్టు ఇవ్వటం జరిగింది.