ఏపీ సచివాలయం లో కరోనా కలకలం..??

  వాస్తవం ప్రతినిధి:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే మరణాల విషయంలో ఐదు వేలకు పైగా సంభవించడంతో ఏపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు వస్తున్నాయి. కనీసం రోజుకి దాదాపు 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలలో టెన్షన్ నెలకొంది. రాజకీయ నాయకులు సహా చాలామంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. పరిస్థితులు ఇలా ఉండగా ఏపీ సచివాలయం లో కరోనా కలకలం అయ్యింది. దాదాపు 20 మంది ఏపీ సచివాలయ ఉద్యోగులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వీరిలో ఒకరు అసెంబ్లీ సహాయ కార్యదర్శి కాగా మిగతా వారు వివిధ శాఖలకు చెందిన ఉద్యోగస్తులు అని తేలింది.

ఒక్కసారిగా ఏపీ సచివాలయంలో ఈ రీతిలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడటంతో మిగతా ఉద్యోగ సిబ్బంది లో ఆందోళన వ్యక్తమైంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే చాలా దారుణంగా పాజిటివ్ కేసులు బయట పడుతున్న నేపథ్యంలో సామాన్య జనులు ఉద్యోగాలు చేయడానికి తెగ భయపడుతున్నారు.