సభ సాక్షిగా భట్టి ఛాలెంజ్ స్వీకరించిన తలసాని…అన్నట్లుగానే!

వాస్తవం ప్రతినిధి: తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాల్లో భాగంగా బుధవారం ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించి ప్రసగింస్తున్న సమయంలో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క కలుగజేసుకుని అసలు తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కడుతున్నారా? దమ్ముంటే ఎక్కడున్నాయో చూపించాలి అంటూ సభ సాక్షిగా సవాల్ విసిరారు. అయితే ఆ సవాల్ ను స్వీకరించిన మంత్రి తలసాని నేనే స్వయంగా మిమ్మల్ని తీసుకెళ్లి ఆ ఇళ్లను చూపిస్తాను అంటూ సమాధానం ఇచ్చారు.

ఈ నేపథ్యంలో తలసాని అన్న మాట ప్రకారం ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని భట్టి విక్రమార్క నివాసానికి వెళ్లి కాసేపు చర్చల తరువాత భట్టి నివాసంలో కాసేపు చర్చల తరువాత.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చూసేందుకు ఇద్దరు నేతలు ఒకే కారులో వెళ్లారు. మంత్రి తలసాని.. భట్టికి జియాగూడలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబల్ బెడ్ రూమ్ ఇళ్లను చూపించారు. భట్టి వెంట కాంగ్రెస్ నేతలు వీహెచ్, కేఎల్ఆర్, విక్రమ్ తదితరులు ఉండగా,తలసాని వెంట మేయర్ బొంతు రామ్మోహన్,ఎమ్మెల్యే వివేక్ లు ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ సందర్బంగా.. మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. సిటీలో కొన్ని ప్రదేశాలు చూశాం… ఇంకా 60 ప్రదేశాలు ఉన్నాయన్నారు. రేపు కొల్లూరు, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్ లో చూస్తామని పేర్కొన్నారు. పేదలు గొప్పగా బతకాలనే ఆలోచనే సీఎం కెసిఆర్ ది…. ఇందిరమ్మ ఇండ్లలో బెనిఫిషరి కొంత కట్టాలి…. కానీ డబుల్ బెడ్ రూమ్ అంతా ఫ్రీ అని తెలిపారు తలసాని. ఇప్పటి వరకు ఈ స్థలంలో ఉన్నవారి కోసం కట్టినవి… కొత్త వారి కోసం మిగిలిన చోట నిర్మాణాలు ఉన్నాయన్నారు. రేపు కూడా తిరుగుతాం వీలైనంత తొందరగా పూర్తి చేయాలన్నది మా ఆలోచన అని తెలిపారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణంలో భట్టి కూడా సంతృప్తి చెందారు…లక్ష ఇండ్లు చూపించే వరకు భట్టి ని తిప్పుతానని వెల్లడించారు