రాజధాని వ్యవహారంలో బాబు అండ్ కో బాగుపడ్డారు: కొడాలి నాని

వాస్తవం ప్రతినిధి: రాజధాని అమరావతి వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై ఏపీ మంత్రి,వైసీపీ నేత కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజధాని వ్యవహారంలో బాబు అండ్ కో బాగుపడ్డారు అంటూ నాని ఫైర్ అయ్యారు. చంద్రబాబు అవినీతి చేసి డబ్బు ఎలా సంపాదించాలో తెలిసిన మాస్టర్ అని, ఆయన ఎన్ని స్టేలు తెచ్చుకున్నారో ప్రజలందరికీ తెలుసునని నాని వ్యాఖ్యానించారు.

అమరావతిలో రాజధాని వస్తుంది అని టీడీపీ నేతలకు ముందే తెలుసనీ ఈ క్రమంలోనే అక్కడ భూములు కొనుగోలు చేసుకోవాలి అంటూ టీడీపీ నేతలకు చంద్రబాబు ముందే చెప్పారు అంటూ నాని ఆరోపించారు. అంతేకాకుండా రాజధానిలో రైతులను మోసం చేసి ఎకరం రూ.25లక్షలకు కొనుగోలు చేశారని, రాజధాని అడ్డం పెట్టుకొని టీడీపీ నేతలు రియల్‌ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు గడించారని మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్త చేశారు. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచీ భూ కుంభకోణం జరిగిందని చెప్తున్నామని, ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం‌ జగన్‌ కుంభకోణంపై కేబినెట్ సబ్‌ కమిటీ, సిట్‌ నియమించారని నాని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలోనే గత మార్చిలోనే అమరావతి రాజధాని భూ కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కేబినెట్ లో కోరామని,అయితే దానికి కేబినెట్ కూడా ఆమోదం తెలపడం తో ఈ మేరకు కేంద్రాన్ని కూడా కోరినట్లు నాని తెలిపారు.