వాస్తవం ప్రతినిధి: యూరప్‌తో ఏర్పాటు చేసిన డబ్ల్యూహెచ్‌వో ప్రాంతీయ వర్చువల్ సమావేశంలో WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ మాట్లాడుతూ.. “మహమ్మారిని ఎదుర్కోవటానికి టీకాలు, చికిత్సా విధానాల అభివృద్ధి కోసం WHO ఏసీటీ కార్యక్రమంలో భాగమైన ‘కొవాక్స్’ సౌకర్యం ద్వారా ఇప్పటివరకు 92 తక్కువ ఆదాయ దేశాలు సహాయం కోరుతున్నాయి. 80 అధిక ఆదాయ దేశాలు ఆసక్తిని వ్యక్తం చేశాయి. చాలా దేశాలు ఇంకా నిర్ణయం ప్రకటించలేదు. ఈ వారం చివరిలోగా అన్ని దేశాలూ చేరాలి” అని అన్నారు.