మరోసారి ట్రంప్ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరిక..!!

వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. అమెరికాపై ఏదైనా దాడి జరిగితే అంతకుమించి “1,000 రెట్లు ఎక్కువ” ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు. ఇరాన్‌ కుడ్స్‌ఫోర్స్‌ అధినేత సులేమానీ గత జనవరిలో ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ విమానాశ్రయ సమీపంలో అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో మరణించాడు. దీనికి ప్రతీకార చర్య తీసుకోవాలని ఇరాన్‌యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో.. ఉగ్రవాద నాయకుడు సులేమాని హత్యకు ప్రతీకారంగా అమెరికాపై ఇరాన్ హత్య, లేదా ఏ రూపంలోనైనా,ఎలా దాడిచేసినా దానికి వెయ్యిరెట్లు అధికంగా ప్రతి స్పందిస్తామంటూ ట్విట్ చేశారు.