భారత్ లో చిక్కుకున్న ప్రవాసులు విదేశాలకు వెళ్లడానికి “వీబీఎం” ఎంతో ఉపయోగపడింది : హర్దీప్ సింగ్

వాస్తవం ప్రతినిధి: ‘వందే భారత్ మిషన్'(వీబీఎం) ద్వారా ఇప్పటివరకు సుమారు 16.30 లక్షల మంది ప్రవాసులను విమాన, ఇతర మార్గాల ద్వారా భారత్‌కు తరలించడం జరిగిందని భారత పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మంగళవారం తెలియజేశారు. వీబీఎం కార్యక్రమం కరోనా వల్ల విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు స్వదేశానికి రావడానికి ఎంతో ఉపయోగపడిందని ఆయన అన్నారు. అలాగే భారత్‌లో చిక్కుకున్న ప్రవాసులు విదేశాలకు వెళ్లడానికి కూడా ఈ కార్యక్రమం అవకాశం కల్పించిందని మంత్రి తెలిపారు.