స్వదేశానికి చేరుకున్న పాకిస్థాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులు ..!!

వాస్తవం ప్రతినిధి: కరోనా లాక్‌డౌన్ వల్ల విదేశాల్లో చిక్కుకున్న భారత ప్రవాసులను కేంద్రం ‘వందే భారత్ మిషన్'(వీబీఎం) ద్వారా స్వదేశానికి తరలిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలాఉంటే… మహమ్మారి కరోనా వల్ల పాకిస్థాన్‌లో చిక్కుకుపోయిన 350 మంది భారతీయులు రోడ్డు మార్గంలో అటారీ సరిహద్దు గుండా మంగళవారం స్వదేశానికి చేరుకున్నారు. వీరు ఛత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారని పంజాబ్ ప్రభుత్వాధికారులు తెలిపారు. వీరిలో కొంతమంది వద్ద పాక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన కొవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ ఉందని … కొవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ లేనివారికి అటారీలో కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వాధికారులు తెలియజేశారు.