మరోసారి బోయపాటి తో అల్లు అర్జున్..??

వాస్తవం సినిమా: చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని “అలా వైకుంఠపురంలో “ సినిమా తో ఈ ఏడాది ప్రారంభంలో అల్లు అర్జున్ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా సంక్రాంతి పండుగకు వచ్చే టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. ఆ తరువాత కరోనా వైరస్ రావటంతో పెద్ద సినిమాలేవీ రాకపోవడంతో ఈ యేడాదికి “అలా వైకుంఠపురం లో” సినిమా యే అతి పెద్ద హిట్ అని అంటున్నారు సినిమా విశ్లేషకులు. ఇదిలా ఉండగా నెక్ట్స్ సినిమా సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అనే టైటిల్ కలిగిన సినిమాని అల్లు అర్జున్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలావుండగా సరైనోడు సినిమా తో అల్లు అర్జున్ కి అతి పెద్ద మాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన బోయపాటి, మరో సినిమా బన్నీతో చేయటానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ తో చేస్తున్న సినిమా అయిన వెంటనే… అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పై హోం వర్క్ బోయపాటి స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇప్పటికే ఆ సినిమాకి సంబంధించిన లైన్ బన్నీకి బోయపాటి చెప్పినట్లు అంతా ఓకే అయినట్లు… పూర్తి స్క్రిప్ట్ వినిన తరువాత అధికారిక ప్రకటన రానున్నట్లు వార్తలు ఇండస్ట్రీలో వస్తున్నాయి.