స్టార్ట్ అయిన రాంగోపాల్ వర్మ బయోపిక్…??

వాస్తవం సినిమా: వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ బయోపిక్ ఇటీవల స్టార్ట్ అయింది. తన బయోపిక్ ని రాంగోపాల్ వర్మ పర్యవేక్షణలో దొర సాయి తేజ చిత్రీకరిస్తున్నాడు. బొమ్మకు మురళి ఈ బయోపిక్ ని నిర్మిస్తున్నారు. ఆర్జీవీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా మూడు భాగాలుగా రాబోతుందట. ఈ నేపథ్యంలో ఫస్ట్ పార్ట్ షూటింగ్ రామ్ గోపాల్ వర్మ తల్లి సూర్యావతి కెమెరా స్విచాన్ చేసి ప్రారంభించగా ఆయన సోదరి విజయ ఫస్ట్ షాట్ కు క్లాప్ కొట్టారు. తాజాగా వీటికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేసి అభిమానులతో పంచుకున్నాడు. సినిమాలో రాముగా దొర సాయి తేజ నటిస్తున్నాడు. అంతేకాకుండా పార్ట్ వన్ మొత్తం రాంగోపాల్ వర్మ కుర్రతనం లో కాలేజి రోజుల్లో ఏ విధంగా వ్యవహరించారు అనేదాని గురించి ఉంటుందని సినిమా యూనిట్ తెలిపింది. ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ తల్లి సూర్యావతి నుంచి నటుడు ధర సాయి తేజ ఆశీర్వాదం తీసుకున్నారు. చాలావరకు రాంగోపాల్ వర్మ కాలేజీ రోజుల్లో అంతా విజయవాడలో ఉండటంతో పాటు ఎక్కువగా గొడవలకు వెళ్లారు అనే టాక్ ఉంది. దీంతో మొదటి భాగంలో రాంగోపాల్ వర్మ రెబెల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.