మహేష్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్..??

వాస్తవం సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు “గీత గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో “సరిలేరు నీకెవ్వరు” సినిమా తో బ్లాక్ బస్టర్ విజయం సాధించి..టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర హ్యాట్రిక్ తన ఖాతాలో వేసుకున్నాడు మహేష్. కాగా తన నెక్స్ట్ సినిమా కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో పరశురామ్ తో చేస్తున్నట్లు, సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు నాడు, మే 31 వ తారీకు “సర్కారు వారి పాట” అనే టైటిల్ కలిగిన సినిమా అని వెల్లడించారు.

కాగా ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఓ ప్రముఖ పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ నటించడానికి రెడీ అయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ వార్తకు సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. అంతేకాకుండా అమెరికాలో ఈ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవనన్నట్లు అందుకోసం సినిమా యూనిట్ స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ లో ప్రయాణించ బోతున్నట్లు సమాచారం.