కరోనాతో వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ కన్నుమూత

వాస్తవం ప్రతినిధి: తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ రావు మృతి చెందారు. గత కొద్దికాలంగా కరోనా వ్యాధితో ఆయన భాదపడుతూ.. చెన్నైలో మృతి చెందారు. గూడూరు ఎమ్మెల్యేగా మరియు రాష్ట్ర ప్రాధమిక విద్యా శాఖా మంత్రిగా కూడా ఆయన పని చేశారు. టీడీపీకి రాజీనామా చేసి.. వైసీపీ తరపున ఎంపీగా పోటీచేసి గెలిచారు.

దుర్గాప్రసాద్‌ 1985లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 28 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యారు. నెల్లూరు జిల్లా గుడూరు నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరి తిరుపతి నుంచి ఎంపీగా గెలుపొందారు.