మెగాబ్రదర్ నాగబాబు కి కూడా కరోనా పాజిటివ్..!!

వాస్తవం ప్రతినిధి: ప్రపంచంలో ప్రధాని మొదలుకొని పేదవాని వరకు ఎవ్వరిని విడిచి పెట్టడం లేదు కరోనా వైరస్. రష్యా దేశంలో వ్యాక్సిన్ వచ్చినా గానీ మిగతా దేశాలలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య ఉన్న కొద్ది పెరుగుతూ ఉండటంతో… ప్రపంచం మామూలు స్థితికి రావటానికి ఇంకా టైం పట్టే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పుకొస్తుంది. ఇదిలా ఉండగా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా గాని సెలబ్రిటీలు కూడా కరోనా కి బలైపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నాయకులతో పాటు సినిమా ప్రముఖులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. కాగా చికిత్స సరైన రీతిలో తీసుకోవటంతో చాలావరకు ఈ మహమ్మారిని జయించారు. ఇదిలా ఉండగా మెగాబ్రదర్ నాగబాబు ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతేకాకుండా ఖచ్చితంగా మహమ్మారిని జయించి, పూర్తిగా కోలుకొని ప్లాస్మా దానం చేస్తానని స్పష్టం చేశారు. దీంతో నాగబాబు పెట్టిన కామెంట్ కు మెగా అభిమానుల నుండి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. మీరు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నట్లు కామెంట్లు చేశారు. అదేవిధంగా ఇండస్ట్రీలో ఉన్న వాళ్లు కూడా నాగబాబు కు ధైర్యం చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.