కర్ణాటక హోం శాఖ మంత్రి కి కరోనా పాజిటివ్..!!

వాస్తవం ప్రతినిధి: దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలో కరోనా వైరస్ మొదటి లో బాగా ఎదుర్కొన్న దేశంగా ఇండియాకి మంచి పేరు వచ్చింది. చివరిదశలో వచ్చేసరికి వైరస్ వ్యాప్తి ఊహించని విధంగా ఉండటంతో ప్రజలలో నాయకులలో వైద్యులలో భయాందోళన మొదలయింది. ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య లో 50 లక్షల మార్కు దాటడం జరిగింది. కాగా దేశంలో అత్యధిక పాజిటివ్ కేసుల సంఖ్య వస్తున్న రాష్ట్రంలో కర్ణాటక కూడా ఒకటి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, అనేక మంది నేతలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా కర్ణాటక హోంశాఖ మంత్రి బస్వరాజ్ బొమ్మైకి కరోనా సోకింది. ఇటీవలే అయన కరోనా టెస్టులు చేయించుకున్నారు. ఈ టెస్టుల్లో ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలింది. అయితే, ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో ఆయన హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.