మరిన్ని ట్రైన్స్ అందుబాటులోకి తెచ్చిన రైల్వే శాఖ..!!

వాస్తవం ప్రతినిధి: కరోనా వైరస్ కారణంగా మొన్నటి వరకు సాధారణ రైళ్ల రాకపోకలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల మొదలైన గాని చాలావరకు రద్దీ గా పరిస్థితి మారటం తో పాటు ట్రైన్లలో సోషల్ డిస్టెన్స్ లేకుండా జనాలు ఇరుకుగా ఉండే పరిస్థితి ఉండటంతో మరిన్ని ట్రైన్స్ అందుబాటులోకి తీసుకురావటానికి రైల్వేశాఖ నిర్ణయించింది.

అయితే సాధారణ ట్రైన్ ల మాదిరిగా కాకుండా క్లోన్ రైళ్లను గడపడానికి ఇండియన్ రైల్వేస్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 21 నుంచి దేశవ్యాప్తంగా 40 క్లోన్ రైళ్లను నడపాలని డిసైడ్ అయ్యింది. ప్రయాణికుల రద్దీ, అధిక వెయిటింగ్ లిస్టులో ఉన్న రూట్లలో ఈ క్లోన్ రైళ్లను గడపడానికి రైల్వేశాఖ డిసైడ్ అయింది .

అంతే కాకుండా పది రోజులకు ముందే క్లోన్ రైళ్ల టికెట్ల బుకింగ్ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ అడ్వాన్స్ బుకింగ్ ఈ నెల 19వ తారీకు నుండి మొదలు కానుంది. దీంతో క్లోన్ ట్రైన్స్ సాధారణ ట్రైన్స్ కంటే ముందే బయలుదేరు తాయని…వీటికి హల్టింగులు కూడా తక్కువగా ఉంటాయని రైల్వే బోర్డ్ చైర్మన్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు.

ఇక ఈ క్లోన్ ట్రైన్లలో అధిక ఛార్జీలు వసూలు చేయనున్నారని తెలుస్తోంది. కాగా ఈ నలభై రైళ్లలో దాదాపు ముప్పై రెండు క్లోన్ రైళ్లు బీహార్ ప్రయాణికులకు అందుబాటులోకి రైల్వే శాఖ తీసుకొచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలలో తెలంగాణా రాష్ట్రానికి రెండు రైళ్లు కేటాయించగా, ఏపీకి ఒక్కటి కూడా దక్కలేదు.