ఘోర పడవ ప్రమాదం..పది మంది గల్లంతు

వాస్తవం ప్రతినిధి: రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చంబల్ నదిలో 50మంది ప్రయాణికులతో వెళుతున్న పడవ బోల్తా పడింది. కాగా పడవలోని 10 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. కోటా జిల్లాలోని ఇటావా పట్టణానికి సమీపంలోని ఖతోలీ ప్రాతంలో చంబల్ నదిని దాటుతున్న సమయంలో పడవ బోల్తా పడింది. పడవలో 14 బైకులు సైతం ఉన్నట్టు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రెక్స్క్యూ బృందాలు గల్లంతైన వారికోసం గాలిస్తున్నాయి. కాగా 40 మందిని స్థానికులు కాపాడగా 10 మంది జాడ కనిపించట్లేదు. పడవలో పరిమితికి మించి ఎక్కడంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.