పోలవరం ప్రాజెక్టు నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మోడీ సర్కార్..??

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ జీవనాడి ప్రాజెక్టు పోలవరం విషయంలో పెండింగ్ లో ఉన్న నిధులు రిలీజ్ చేయడానికి మోడీ సర్కార్ రెడీ అయినట్లు జాతీయ స్థాయిలో టాక్.

ఇటీవల రాజ్యసభలో వైసిపి సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో ఈ విషయం పై చర్చించడం, వెంటనే కేంద్రం కూడా నిధులు ఇవ్వటానికి రెడీ అవ్వడం తో త్వరలోనే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి అవడం గ్యారెంటీ అని ఏపీ వైస్సార్సీపీ నేతలు అంటున్నారు.

చాలావరకూ ఆర్భాటాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఏపీ ప్రభుత్వం పనులకు పెద్ద పీట వేస్తూ ఉండటంతో మోడీ కూడా పోలవరం ప్రాజెక్టు త్వరగా కంప్లీట్ అయితే ఏపీ అభివృద్ధి అవుతుందని, ఈ విషయంలో కేంద్రం పూర్తిగా ఏపీ ప్రభుత్వానికి అండగా ఉంటుందని వైసీపీ నేతలకు భరోసా ఇచ్చినట్లు సమాచారం.

జాతీయ ప్రాజెక్ట్ కావడంతో పోలవరం విషయంలో విభజన చట్టం ప్రకారం కేంద్ర అండగా ఉంటుందని స్పష్టం చేశారట. ఇదిలా ఉండగా వచ్చే ఏడాది డిసెంబర్ మాసంలో పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని, ఇప్పటికే నేతలు తెలపడం జరిగింది.

ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం కూడా పెండింగ్ లో ఉన్న 3 వేల కోట్ల నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో…. మిగతా బ్యాలెన్స్ పనులు చాలావరకు జరిగిపోతాయని పక్కా వ్యూహంతో జగన్ సర్కార్ పోలవరం ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళుతుందని నిపుణులు అంటున్నారు.