దేశ రక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు: రాజ్‌నాథ్

వాస్తవం ప్రతినిధి: భారత్-చైనా సరిహద్దు  విషయంలో రెండుదేశాల మధ్య వివాదాలున్నాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు పెంచుకునేందుకు భారత్‌ ప్రయత్నిస్తోందన్నారు.లోక్‌సభలో రాజ్‌నాథ్‌ సింగ్ భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై రాజ్‌నాథ్ ఓ ప్రకటన చేశారు. చైనాతో భారత్‌ స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటోందన్నారు. సరిహద్దుల విషయంలో భారత్ మంచి పరిష్కారం కోరుకుంటుంటోదన్నారు.సామరస్యపూర్వక చర్చలతోనే సరిహద్దు వివాదాలకు పరిష్కారం లభిస్తుందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.

ఎల్‌ఏసీ దాటి రావడానికి చైనా బలగాలు ప్రయత్నిస్తోందని.. అయితే భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతోందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. భారత జవాన్ల సాహసానికి పార్లమెంట్‌ సెల్యూట్‌ చేస్తోందన్నారు. మే నుంచి సరిహద్దుల్లో భారీగా ఆయుధాలు, సైన్యాన్ని చైనా మోహరిస్తోందన్నారు.

భారత్‌ కూడా అదే స్థాయిలో సైన్యాన్ని మోహరిస్తోందన్నారు. సరిహద్దులను మార్చాలన్న చైనా కుతంత్రాన్ని మన సైన్యం తిప్పికొట్టిందన్నారు. దేశ రక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. భారత బలగాలు దేశ గౌరవాన్ని పెంచుతున్నాయన్నారు. సైన్యం పూర్తి అప్రమత్తంగా ఉందని.. ఎలాంటి పరిస్థితుల్ని అయినా…ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు.