ఆమెతో నాకు ఎలాంటి సంబంధం లేదంటున్న తాప్సి..!!

వాస్తవం సినిమా: బాలీవుడ్ నటుడు సుశాంత్ సూసైడ్ కేస్ విషయంలో డ్రగ్స్ కోణం బయటపడటంతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అనేక మంది ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. సుశాంత్ సింగ్ కి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి అధికమోతాదులో డ్రగ్స్ ఇచ్చినట్లు అందువల్ల అతను చనిపోయినట్లు తాజాగా వచ్చిన వార్తలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ డిస్కషన్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రియా చక్రవర్తి రిమాండ్ లో ఉంది. ఇప్పటికే డ్రగ్స్ కోణంలో రియా చక్రవర్తి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయట పెట్టడం తెలిసిందే. ఇదిలా ఉండగా తాప్సి పేరు కూడా వచ్చినట్లు వార్తలు రావడంతో తాజాగా ఆమె స్పందించింది. అసలు రియా చక్రవర్తి ఎవరో తనకు తెలియదని క్లారిటీ ఇచ్చింది. కనీసం ఆమెతో పరిచయం కూడా లేదని తెలిపిన తాప్సీ… బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసు విషయంలో ఆమెను టార్గెట్ చేయడం, ఆమెను దారుణంగా విమర్శలు చేయడం అన్యాయమని పేర్కొంది. అంతేకాకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది ఏదో ఒక సమయంలో తప్పు చేశారని, కానీ రియా చక్రవర్తిని చూసినంత దారుణంగా మరెవ్వరినీ చూడలేదని ఆవేదన వ్యక్తం చేసింది.