యూఎన్‌ కమిషన్‌లో భారత్‌ సభ్యత్వం..!!

వాస్తవం ప్రతినిధి: ఐక్యరాజ్యసమితి ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ కౌన్సిల్‌ (ఇసోసాక్‌)లో మహిళ అభ్యన్నతి కోసం ఏర్పాటైన కమిషన్‌లో భారత్‌ సభ్యత్వం సాధించింది. ఈ విషయాన్ని ఐక్యారాజ్య సమితి భారత శాశ్వత ప్రతినిధి టీ ఎస్ తిరుమూర్తి తెలిపారు. “స్త్రీపురుష సమానత్వం, మహిళా అభ్యున్నతి కోసం భారత్ చేసిన కృషికి ఇది నిదర్శనం. మాకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు” అని ఆయన ట్వీట్ చేశారు. కమిషన్‌ సభ్యత్వం కోసం జరిగిన ఓటింగ్‌లో చైనా చిత్తుగా ఓడిపోయింది. కాగా, ఈ కమిషన్ లో భారత్ 2021 నుంచి 2025 వరకూ కొనసాగనుంది. ఈ కమిషన్‌లో సభ్యత్వం కోసం భారత్‌తో పాటు చైనా, అఫ్ఘనిస్థాన్ కూడా పోటీపడ్డాయి.