రేపిస్టులను బహిరంగంగా ఉరితీయండి : ఇమ్రాన్‌ఖాన్

వాస్తవం ప్రతినిధి: రేపిస్టులను బహిరంగంగా ఉరితీయాలన్నారు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌. మొన్నీమధ్య లాహోర్‌ హైవేపై వెళుతున్న ఓ మహిళను అత్యంత దారుణంగా రేప్‌ చేశారు ఇద్దరు దుండగులు. ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్న మ‌‌హిళ‌ను ఇద్ద‌రు గ‌న్‌పాయింట్‌లో బెదిరించి అత్యాచారం చేశారు. ఈ ఘ‌ట‌న పాకిస్థాన్‌లో పెను సంచ‌ల‌నం రేపింది. యావ‌త్ దేశం ఆ ఘ‌ట‌న ప‌ట్ల షాక్‌ వ్య‌క్తం చేసింది. నిందితుల‌కు క‌ఠిన శిక్ష వేయాల‌ని డిమాండ్ వ‌చ్చింది.

ఈ నేప‌థ్యంలో పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. అత్యాచార కేసులో దోషిగా తేలిన వారిని బ‌హిరంగంగా ఉరి తీయాల‌న్నారు. లేదంటే ర‌సాయ‌నిక ప‌ద్ధ‌తిలో రేప్‌కు పాల్ప‌డిన‌వారి వృష‌ణాలు ప‌నిచేయకుండా చేయాల‌ని సూచించారు. రేపిస్టులను బహిరంగంగా ఉరితీయాలన్నారు‌.. అత్యాచారానికి పాల్పడిన వారిని అలా బహిరంగంగా ఉరి తీయాలని ఉన్నా పాకిస్తాన్‌ ఆ పని చేయలేదన్నారు ఇమ్రాన్‌.. అలా చేస్తే యూరోపియణ్ యూనియన్‌ తమ వాణిజ్య సంబంధాలను తెంచుకుంటుందని చెప్పారు. ఓ టీవీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఇమ్రాన్ ఈ కామెంట్ చేశారు. అత్యాచారానికి పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు..