రీ-ఎంట్రీ వీసాలపై తమ దేశానికి వెళ్లిన ప్రవాసులకు సౌదీ స‌ర్కార్ గుడ్ న్యూస్..!

వాస్తవం ప్రతినిధి: సౌదీ అరేబియాలో నివసిస్తున్న ప్రవాసులకు అక్క‌డి స‌ర్కార్ తాజాగా తీపి క‌బురు అందించింది. ప్ర‌వాసులు ఎవ‌రైతే రీ-ఎంట్రీ వీసాలపై తమ దేశానికి వెళ్లి, కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో నిర్ణీత సమయానికి తిరిగి రాలేక‌పోయారో వారు ఇప్పుడు దేశానికి తిరిగి రావడానికి అనుమతి ఇచ్చింది. దేశంలోకి ప్రవేశించే ఎవరైనా స‌రే 48 గంటల ముందు జారీ చేసిన కొవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ చూపించాల్సిందేన‌ని‌ సంబంధిత అధికారులు పేర్కొన్నారు. సెప్టెంబర్ 15 ఉదయం 6 గంటల నుండి ప్ర‌వాసులు తిరిగి సౌదీకి రావచ్చని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.