అమెరికాకు మహేష్ బాబు..??

వాస్తవం సినిమా: కరోనా వైరస్ కారణంగా మొన్నటి వరకు షూటింగ్ లు మొత్తం ఆగిపోయాయి. దాదాపు ఐదు నెలల పాటు స్టార్ హీరోలు ఎవరు కూడా కెమెరా ముందుకు రాని పరిస్థితి. అయితే ఇటీవల ప్రభుత్వాల నుండి అనుమతులు రావడంతో మెల్లమెల్లగా కరోనా వైరస్ పై నుండి బయటకు వస్తున్నారు.

ఈ క్రమంలో వరుస విజయాలతో ఇండస్ట్రీలో మంచి జోరుమీదున్న మహేష్ బాబు అన్నపూర్ణ స్టూడియోలో ఒక యాడ్ షూటింగ్ లో పాల్గొనడం జరిగింది. దీంతో చాలా వరకు కరోనా భయం నుండి మహేష్ బయటపడినట్లు త్వరలోనే తన నెక్స్ట్ సినిమా “సర్కారు వారి పాట” మొదలు పెట్టాలని రెడీ అయినట్లు ఫిలింనగర్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇందుకుగాను అమెరికాకి సినిమా యూనిట్ త్వరలో వెళ్ళబోతున్నట్లు, అక్కడ చిత్రీకరించిన సన్నివేశాలు అన్నిటినీ ఇప్పటికే డైరెక్టర్ పరుశురాం ఒక స్క్రిప్ట్ రూపంలో రెడీ చేసినట్లు సమాచారం. అమెరికాలో డెట్రాయిట్ కి సినిమా యూనిట్ ఓ చార్టెడ్ ఫ్లైట్ లో వెళ్లడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నట్లు టాక్. అతి తక్కువ టైమ్ లోనే సర్కారు వారి పాట సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడానికి మహేష్ ప్లాన్ చేసినట్లు సమాచారం.