ప్రభాస్ సినిమాలో కృష్ణంరాజు..??

వాస్తవం సినిమా: పెదనాన్న సీనియర్ యంగ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు తో ప్రభాస్ గతంలో కొన్ని సినిమాలు చేయటం తెలిసిందే. బిల్లా, రెబెల్ వంటి సినిమాలను కృష్ణంరాజుతో ప్రభాస్ చేశారు. ఆ రెండు సినిమాలు పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయాయి. కాగా తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ ఓమ్‌ రౌత్‌ దర్శకత్వంలో “ఆదిపురుష్‌” అనే భారీ బడ్జెట్ పౌరాణిక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్ర చేస్తుండగా సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో కనిపించనున్నారు. ఇంకా చాలా మంది ప్రముఖ హీరోల హీరోయిన్ల ను ఈ సినిమాలో తీసుకుంటున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీ మీడియా వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. పరిస్థితి ఇలా ఉండగా సినిమాలో అత్యంత కీలకమైన పాత్రకు గానూ కృష్ణంరాజును తీసుకోవాలన్న ఆలోచనలో ఓమ్ రౌత్ ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణంరాజు గతంలో పలు పౌరాణిక చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలో ఆయనను ఆదిపురుష్‌లో పెట్టడం వలన సినిమాకు మరో అస్సెట్‌గా నిలిచే అవకాశం ఉందని ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కృష్ణంరాజు తో మాట్లాడినట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్.