రెడీ అవుతున్న రేణుదేశాయ్ సినిమా..!!

వాస్తవం సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత చాలావరకు పూణే రాష్ట్రానికి పరిమితమయ్యింది రేణు దేశాయ్. పిల్లలతో … కుటుంబ సభ్యులతో అక్కడే గడుపుతూ రెండో వివాహానికి కూడా అప్పట్లో రెడీ అయినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆ మేటర్ క్లోజ్ అయింది. కాగా అడపాదడపా హైదరాబాదులో చిన్నచిన్న షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ రాణించిన రేణుదేశాయ్ త్వరలోనే సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ విషయం పై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ ఒక ఏడాది కిందట రైతుల సమస్యలపై సినిమా చేస్తున్నట్లు రేణుదేశాయ్ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఆ సినిమా ప్రాజెక్టు గురించి పెద్దగా మాట్లాడలేదు. కానీ తాజాగా మాత్రం రైతులకు సంబంధించిన సినిమా ప్రాజెక్టుపై ప్రీ ప్రొడక్షన్ పనుల్లో రేణుదేశాయ్ నిమగ్నమైనట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే ఇటీవల ప్రముఖ రచయిత గోరేటి వెంకన్న నూ కలసి సినిమాకి సంబంధించిన పాటలను రేణు రాయించుకున్నట్లు సమాచారం. దీంతో త్వరలో పరిస్థితులు అంతా సద్దుమణిగితే షూటింగ్ స్టార్ట్ చేయడానికి రేణుదేశాయ్ రెడీగా ఉన్నట్లు టాక్ వస్తోంది.