నా గుండు సీక్రెట్ ఇదే అంటున్న చిరంజీవి..!!

వాస్తవం సినిమా: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. కాగా ఈ సినిమా షూటింగ్ మొదలైన వెంటనే చాలా త్వరగా కంప్లీట్ చేయడానికి సినిమా యూనిట్ ఇప్పటికే పక్కా షెడ్యూల్ అండ్ స్క్రిప్ట్ తో అంతా రంగం సిద్ధం చేసుకుంది. ఇదిలా ఉండగా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి గుండు తో ఫోటో దిగి సోషల్ మీడియాలో రిలీజ్ చేయడంతో అభిమానులు అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. దేనికోసం మెగాస్టార్ ఈ అవతారం ఎత్తారు అని చర్చలు మొదలయ్యాయి. అసలు అది నిజంగా గుండు ఏనా లేకపోతే మేకప్ లో భాగమా అని డౌట్ ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఏ సినిమా కోసం ఈ విధంగా చిరంజీవి ఒక్కసారిగా తన లూక్ మార్చారు అనేది ప్రతి ఒక్కరిలో ఒక ప్రశ్న నెలకొంది. ఇటువంటి తరుణంలో తన లుక్కు వెనకాల సీక్రెట్ ఇంస్టాగ్రామ్ లో వీడియో రూపంలో రిలీజ్ చేశారు. “నా కొత్త లుక్‌ను అందరూ నిజమని నమ్మేలా చేసిన ఇండస్ట్రీలోని టెక్నీషియన్స్‌ అందరికీ థాంక్స్‌. మ్యాజిక్ ఆఫ్‌ సినిమాకు సెల్యూట్‌” అని చిరు తెలిపారు. కానీ గుండు దేనికి అన్న దాని గురించి మాత్రం చిరంజీవి క్లారిటీ ఇవ్వలేదు .