సరికొత్త టైటిల్ తో పవన్ కళ్యాణ్ సినిమా..??

వాస్తవం సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాలు చేస్తూనే మరోపక్క ఒప్పుకున్న ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి పక్కా వ్యూహలతో ముందుకు వెళ్తున్నారట. ప్రస్తుతం రీ ఎంట్రీ చేస్తున్న ప్రాజెక్టు “వకీల్ సాబ్” సినిమా షూటింగ్ కొద్దిగా బ్యాలెన్స్ ఉండటంతో త్వరలోనే అది కంప్లీట్ చేయనున్నారట. ఆ తరువాత వెంటనే క్రిష్ దర్శకత్వంలో, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒప్పుకున్న సినిమాలను ఒకేసారి షూటింగులు మొదలుపెట్టి కంప్లీట్ చేయడానికి పవన్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

ఇదిలా ఉండగా క్రిష్ సినిమా టైటిల్ “విరూపాక్ష” అని మొదటిలో వార్తలు వచ్చాయి. ఈ టైటిల్ విని అభిమానులు కూడా బావుంది అన్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి “ఓం శివం” టైటిల్ అయితే బాగుంటుందని సినిమా యూనిట్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని పవన్ కి తెలియజేశారు అని, ఆయన కూడా ఇది కరెక్ట్ టైటిల్ అని అన్నట్లు సమాచారం. దీంతో త్వరలోనే క్రిష్- పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి టైటిల్ ప్రకటన ఉంటుందని ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి.