రేపు కోడెల వర్ధంతి.. కోడెల శివరామ్ కు పోలీసుల నోటీసులు!

వాస్తవం ప్రతినిధి: గతేడాది టీడీపీ సీనియర్ నేత,ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తన ఇంటిలోనే ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తోలి వర్ధంతి సందర్భంగా రేపు గుంటూరు జిల్లా నరసరావుపేట,సత్తెన పల్లి లో పలు కార్యక్రమాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో కోడెల కుమారుడు కోడెల శివ ప్రసాద్ కు పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.

కోడెల తొలిలి వర్ధంతి అయినప్పటికీ కూడా కరోనా వ్యాప్తి దృష్ట్యా ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి వీల్లేదని కోరుతూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే పోలీసుల నోటీసులపై శివరామ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కుటుంబ పరంగా జరిగే వర్ధంతి కార్యక్రమాలకు నోటీసులు జారీ చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎలా ఉన్నప్పటికీ రేపు యథావిధిగా కార్యక్రమాలు చేపట్టి తీరుతామని కోడెల శివరామ్ స్పష్టం చేశారు.

టీడీపీ నేత కోడెల శివప్రసాద్ గతేడాది హైదరాబాదులోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత కోడెల ఆయన కుటుంబం ను సర్కార్ ఇబ్బందులకు గురి చేసింది అని ఆ కారణంగానే కోడెల ఇలా ఆత్మహత్యకు పాల్పడినట్లు టీడీపీ ఆరోపించింది. ఇప్పుడు తాజాగా ఆయన వర్ధంతి సందర్భంగా కూడా పోలీసులు ఇలా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దు అంటూ నోటీసులు జారీ చేయడం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది.