ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది: బోండా ఉమా

వాస్తవం ప్రతినిధి: వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పై,ఆ పార్టీ నాయకులపై కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోంది అంటూ టీడీపీ నేత బోండా ఉమామహేశ్వర రావు ఆరోపించారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ ఆయన మండిపడ్డారు.

టీడీపీ ప్రభుత్వ హాయంలో 2014-19 మధ్య దమ్మాలపాటి శ్రీనివాసరావు ఏజీపీగా ఉన్నారని, వైసీపీ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో ప్రభుత్వం పాల్పడుతున్న రాజ్యాంగ, చట్ట ఉల్లంఘనలు, దౌర్జన్యపూరిత కార్యక్రమాలు, తప్పుడు కేసులు వంటి పలు కేసుల విషయంలో ఆయన సమర్ధవంతంగా కోర్టులో ఎదుర్కొంటూ, టీడీపీ న్యాయవాదిగా పనిచేస్తున్నారని, అలాంటి వ్యక్తి పై ఇప్పుడు ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతూ ఇబ్బందులు పెడుతుంది అని ఆయన విమర్శించారు.

ఒకపక్క కోర్టులో ప్రభుత్వానికి మొట్టికాయలు పడుతున్నా సిగ్గురావడం లేదని, కేసులు వాదించిన వారిపై తప్పుడు కేసులు పెడుతోందని, డబ్బులు తీసుకోకపోయినా అచ్చెన్నపై కేసులు పెట్టిందని,. కొల్లు రవీంద్రపై హత్య కేసు బనాయించి జైల్లో పెట్టారు అని బోండా ఉమా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.