అమరావతి భూముల విషయంలో ఎంటర్ అయిన ఏసీబీ..!!

వాస్తవం ప్రతినిధి: అమరావతి భూముల విషయంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. రాజధాని భూములు కొనుగోలు అమ్మకాలు విషయంలో అవకతవకలు జరిగినట్లు సిట్ నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడంతో అసైన్డ్ భూములు ఇతర భూముల క్రయ విక్రయాలు పై మొత్తం ప్రభుత్వ యంత్రాంగం భూ రికార్డులను రెండు వారాల నుండి పరిశీలించడం జరిగింది. అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందించడంతో సిట్ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేయాలని ఏసీబీ ని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. వైసిపి ప్రతిపక్షంలో ఉన్న సమయం నుండి అమరావతి భూముల కొనుగోలు విషయంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపిస్తూనే ఉంది. చంద్రబాబు ఆయన బినామీలు భూములు తక్కువ ధరకు రైతుల దగ్గర భూములు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెగబడ్డారని ఎప్పటినుండో ఆరోపిస్తూనే ఉన్నారు. దీంతో ఇప్పుడు ఏసీబీ మొత్తం చంద్రబాబు హయాంలో రైతుల దగ్గర భూములు కొనుగోలు చేసిన వారిని టార్గెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.