వైఎస్ వివేకా హత్య కేసులో స్పీడ్ పెంచిన సిబిఐ..!!

వాస్తవం ప్రతినిధి: సరిగ్గా 2019 ఎన్నికల ప్రచారం సమయంలో వైయస్ వివేకానంద రెడ్డి ని హత్య చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ సిట్ విచారణ చేపట్టారు. అదే టైంలో టిడిపి నాయకులు కావాలని వైసిపి నాయకులు వివేకానంద రెడ్డిని హత్య చేశారని…. కడప జిల్లాలో సానుభూతి సంపాదించుకోవడం కోసం ఈ పనికి ఒడిగట్టారని ఆరోపించారు.

మరోపక్క ప్రతిపక్షంలో ఉన్న వైసిపి… వైయస్ వివేకానంద రెడ్డి కడప లో ఉంటే గెలవలేమన భావనతో టిడిపి నాయకులు హత్య చేయించారని ఆరోపించారు. ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.

అయితే తన తండ్రి హత్య కేసు విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయని, వైయస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత హైకోర్టు లో పిటిషన్ వేయడంతో వెంటనే న్యాయస్థానం సిబిఐ విచారణ కి ఆదేశించడం జరిగింది.

దీంతో రంగంలోకి దిగిన సిబీఐ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇంటిలో ఉన్న పనివారిని అదేవిధంగా బంధువులను అనేక మంది అనుమానితులను విచారణ జరిపింది. కడప జిల్లాలో సీబీఐ ప్రత్యేక కార్యాలయంలో విచారణ చేసిన అధికారులు తర్వాత సైలెంట్ అయ్యారు.

అయితే తాజాగా మళ్లీ రంగంలోకి దిగి వైయస్ వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ మరియు కూతురు సునీత నుండి సమాచారాన్ని సేకరించారు. అంతేకాకుండా వాచ్ మెన్ రంగయ్య సమక్షంలో సిబిఐ అధికారులు హత్య జరిగిన స్థలంలో రీ కన్స్ట్రక్షన్ చేశారు. దీంతో రాబోయే రోజుల్లో వైఎస్ కుటుంబ సభ్యులతో పాటు మరికొంతమంది ప్రతిపక్ష నాయకులను విచారించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.