కరోనా టెస్ట్‌ల విషయంలో గొప్పగా వ్యవహరించానని మోదీ నాకు ఫోన్‌ చేసారు : ట్రంప్‌

వాస్తవం ప్రతినిధి: ఎన్నికల ప్రచారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రత్యేకంగా ప్రధాని మోదీ పేరును ప్రస్తావించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనకు ఫోన్‌ చేశారని తెలిపారు. కరోనా టెస్ట్‌ల విషయంలో ఆయన గొప్పగా వ్యవహరించారంటూ ప్రశంసించారని తెలిపారు. నెవాడాలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ.. భారత్‌తో పోలిస్తే అమెరికాలో 44లక్షల కరోనా పరీక్షలను ఎక్కువగా నిర్వహించామని తెలిపారు. ఈ ఘనతపైనే మోదీ తనకు ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారని ట్రంప్‌ గుర్తు చేశారు.

కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ట్రంప్ పూర్తిగా విఫలమయ్యారని, ఆ కారణంగా అనేక మంది అమెరికన్‌ పౌరులు ప్రాణాలు కోల్పోయారని బైడెన్ విమర్శించారు. ఈ విమర్శలపై స్పందించిన ట్రంప్‌ కరోనాను ఎదుర్కోవడంలో, కరోనా టెస్ట్‌ల విషయంలో గొప్పగా వ్యవహరించానని మోదీ ఫోన్‌ చేసి కితాబిచ్చారని ట్రంప్‌ తెలిపారు.