భారత్‌కు చెందిన ప్రముఖుల సమాచారాన్ని తస్కరించేందుకు చైనా భారీ ప్లాన్..!!

వాస్తవం ప్రతినిధి: సరిహద్దుల్లో భారత సైనిక శౌర్యాన్ని ఎదిరించలేని డ్రాగాన్‌ దొంగదెబ్బ తీసేందుకు కుట్రపన్నింది. గత రెండు నెలలుగా భారత్‌ సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతున్న పొరుగు దేశం చైనా తన వక్రబుద్ధిని మరోసారి ప్రదర్శించింది. ఓ వైపు ఇరుదేశాల సరిహద్దుల నడుమ ఉద్రిక్త పరిస్ధితులు ఉన్న తరుణంలోనే దేశంలోని ప్రముఖ నేతలపై రహస్యంగా నిఘా పెట్టి సాంకేతిక యుద్ధానికి తెరరేపింది. దేశంలోని 10వేల మంది ప్రముఖలు, భారత్‌కు చెందిన కీలక సంస్థలపై చైనా గూడాచార విభాగం నిఘా పెట్టింది. ఈ మేరకు ఓ జాతీయ పత్రిక సోమవారం సంచలన కథనాన్ని ప్రచురించింది.

చైనా నిఘా నీడలో భారత రాష్ట్రపతి, ప్రధాని, అన్ని రాష్ట్రాల సీఎంలతో పాటు అన్ని రాష్ట్రాల మంత్రులు, మాజీ సీఎంలు, కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతలు ఉన్నట్లు​ జాతీయ పత్రిక ‌ ఓ కథనాన్ని ప్రచురించింది. చైనాకు చెందిన షేక్‌జేన్‌ అనే గూఢాచర సంస్థతో ఆ దేశ నిఘా విభాగం ఈ మేరకు ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా భారత్‌కు చెందిన ప్రముఖుల సమాచారాన్ని తస్కరించేందుకు మరికొన్ని రహస్య కంపెనీలతో చైనా నిఘా సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ‌ జాతీయ పత్రిక ‌ప్రచురించిన కథనం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. మరోవైపు ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ చైనా తీరు మార్చుకోకపోవడంతో భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.