నా అమ్మమ్మ, తాతయ్య చాలా గొప్పవారు : కమలా హారిస్

వాస్తవం ప్రతినిధి: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో డెమొక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్.. ఆదివారం రోజు గ్రాండ్‌పేరెంట్స్ డే సందర్భంగా తన తాతయ్య, అమ్మమ్మను గుర్తుచేసుకున్నారు. వారి ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. “నా అమ్మమ్మ, తాతయ్య చాలా గొప్పవారు. మా తాతయ్య పీవీ గోపాలన్ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాడారు. ఇక మా అమ్మమ్మ.. జనాభా నియంత్రణపై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు పని చేశారు. ఇందుకోసం ఆమె.. దేశ వ్యాప్తంగా పర్యటించి మహిళలతో మాట్లాడారు. మన భవిష్యత్తును మెరుగుపరచడానికి వారు నిబద్దతతో పని చేశారు. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం వారే’ అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.