ప్రపంచంలోనే ఇలాంటి చర్య తీసుకున్న మొదటి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఇజ్రాయెల్..!!

వాస్తవం ప్రతినిధి: ఇజ్రాయెల్ దేశంలో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు భారీగా పెరుతుండ‌డంతో సెప్టెంబ‌ర్ 18నుంచి రెండు వారాల లాక్‌డౌన్ కొన‌సాగ‌నుంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో మూడువారాల లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రపంచంలోనే ఇలాంటి చర్య తీసుకున్న మొదటి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఇజ్రాయెల్ నిలిచింది. మూడు వారాల పాటు కఠినమైన లాక్‌డౌన్ కు కేబినెట్ అంగీకరించిందని, దీనిని పొడిగించే అవకాశం కూడా ఉందని దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదివారం ప్రకటించారు. లాక్‌డౌన్ కాలంలో సూపర్ మార్కెట్లు, ఫార్మసీలు వంటి అత్యస‌ర‌ సేవ‌లు మిన‌హా ఉదయం 6 గంటలకు వరకు పూర్తిస్థాయి ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా దేశంలోని అన్ని పాఠశాలలు, కిండర్ గార్టెన్‌లు రెండు రోజుల ముందుగానే సెప్టెంబర్ 16న మూసివేస్తారు.