ఆ సీనియర్ హీరో సినిమాని రీమేక్ చేస్తున్న శింబు ..!!

వాస్తవం సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో మన్మధ సినిమా తో శింబు మంచి గుర్తింపు సంపాదించాడు . కాగా గత కొన్ని రోజుల నుండి సినిమాలు చేయడం చాలా వరకు తగ్గించేశారు. కారణం ఏంటో తెలియక పోవటంతో ఆయన అభిమానులు నిరాశలో ఉన్నారు. ఇటువంటి తరుణంలో వారిలో జోష్ నింపడానికి శింబు రెడీ అయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సీనియర్ నటుడు, విలక్షణ నటుడు కమల్ హాసన్ 70 లో నటించిన ఓ సూపర్ హిట్ సినిమాని శింబు రీమేక్ చేయనున్నారట. ఆ సినిమా పేరు ‘సిగాప్పు రోజాక్కల్‌’. అందులో లవ్ ఫెయిల్యూర్ అయ్యి, మానసిక సమస్యలతో సైకోగా మారి అమ్మాయిలను చంపే పాత్రలో కమల్‌ కనిపించారు. 1978లో వచ్చిన ఈ చిత్రానికి భారతీరాజా డైరెక్టర్. ఇప్పుడు సీక్వెల్‌కు భారతీరాజా తనయుడు భారతీ కె మనోజ్‌ దర్శకత్వం వహిస్తారని సమాచారం‌. మరో దర్శకుడు రామ్‌ స్క్రీన్ ప్లేను అందిస్తున్నారట.