మళ్లీ తెరపైకి ఏపీ స్పెషల్ స్టేటస్…!!

వాస్తవం ప్రతినిధి: ప్రస్తుతం వర్షాకాల పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు ఢిల్లీలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశం జరిగిన క్రమంలో వైసిపి లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ… కరోనా నియంత్రణ చర్యలు , ఇండియా చైనా బోర్డర్ వివాదాలు అదే విధంగా రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ నిధుల వంటి అంశాలపై సభలో చర్చించాలని స్పీకర్ ని కోరినట్లు తెలిపారు.

అదేవిధంగా ప్రత్యేక హోదా అంశంపై కూడా చర్చించాలని స్పీకర్ కి సూచించినట్లు తెలియజేశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ కావటంతో ఏపీ స్పెషల్ స్టేటస్ విషయంలో తగ్గే ప్రసక్తి లేదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. మరో పక్క టిఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నాగేశ్వరరావు మాట్లాడుతూ…

రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సభలో ప్రస్తావిస్తామని పేర్కొన్నారు. 11 ఆర్డినెన్స్ లను కేంద్రం ప్రవేశపెట్టబోతుందని…. మొత్తం 25 బిల్లులు ఉన్నాయని తెలిపారు. నూతన విద్యుత్ బిల్లులు వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు.