ఒబామా ఫోటోగ్రాఫర్‌కు టోరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ అవార్డ్‌ ..!!

వాస్తవం ప్రతినిధి: ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ పీట్ సౌజాకు ది వే ఐ సీ ఇట్‌ చిత్రానికి 45 టోరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ అవార్డ్‌ లభించింది. అయితే పీట్ సౌజా గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు వ్యక్తిగత, వైట్ హౌస్ ఫోటోగ్రాఫర్‌గా దశాబ్ద కాలం పాటు పని చేశారు. అయితే ది వే ఐ సీ ఇట్ చిత్రంబపై సౌజా స్పందిస్తు ఇందులో బరాక్‌ ఒబామా ప్రెసిడెంట్‌గా, వ్యక్తిగా విభిన్న కోణాలను ఆవిష్కరించినట్లు తెలిపారు. మరోవైపు ఈ చిత్రంలో సామాజిక, రాజకీయ కోణాలు ఉంటాయని పీట్ సౌజా పేర్కొన్నాడు. కాగా పీట్ సౌజా మే 2019 సంవత్సరం హైదరాబాద్‌ పర్యటనలో అమెరికన్ ఫిల్మ్ మేకర్ డాన్ పోర్టర్ డాక్యుమెంటరీని రూపొందించారు.