రకుల్ ప్రీత్ పేరు రావటంతో మిగతా వారిలో టెన్షన్..??

వాస్తవం సినిమా: బాలీవుడ్ నటుడు సుశాంత్ సూసైడ్ కేసులో డ్రగ్స్ కోణం బయటపడటంతో నార్కో అధికారులు రియా చక్రవర్తిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును ఒక పక్క సిబిఐ మరో పక్క ఈడి ఆ తర్వాత డ్రగ్స్ విషయం హైలెట్ అవటంతో నార్కో అధికారులు కూడా ఎంటర్ కావటంతో కేసుపై అందరికీ ఆసక్తి నెలకొంది. దీనిలో భాగంగా రియా చక్రవర్తి ఎన్సీపీ విచారిస్తున్న నేపథ్యంలో సంచలన నిజాలు బయటపడ్డాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఎవరెవరు డ్రగ్స్ వినియోగిస్తున్నారు వంటి విషయాల గురించి రియా చక్రవర్తి పోలీసులకు కొన్ని పేర్లు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిలోభాగంగా రకుల్ ప్రీత్ సింగ్ పేరు రియా చెప్పినట్లు సమాచారం. ఒక్క రకుల్ ప్రీత్ సింగ్ మాత్రమే కాకుండా కొంత మంది డిజైనర్లు అదేవిధంగా 25 మంది నటీనటుల పేర్లు కూడా రియా ఎన్సీపీకి తెలిపినట్లు టాక్. టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి రకుల్ ప్రీత్ సింగ్ పేరు రావడంతో మిగతా హీరోయిన్ల లో టెన్షన్ మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రియా చక్రవర్తి తో ఎవరెవరు ఎప్పుడు కాంటాక్ట్ అయ్యారు అన్న విషయం బయట పెట్టడానికి పోలీస్ అధికారులు కాల్ లిస్ట్ డేటా సేకరించడానికి రెడీ అయినట్లు దీంతో మిగతా వారిలో టెన్షన్ మొదలైనట్లు టాక్.