తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన టమోటా ధరలు!

వాస్తవం ప్రతినిధి: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. టమాటా ధరలకు కూడా రెక్కలొచ్చాయి. కూరగాయాలతో పాటు టమాటా కూడా సామాన్యుడికి అందనంత ఎత్తులో కూర్చుంది. కేవలం పదంటే పది రోజుల వ్యవధిలో ఏకంగా కిలో టమాటా 30 రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో టమాటా ధర 50 నుంచి 60 రూపాయల వరకు పలుకుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడం, భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడం కారణంగా టమాటా ధరలు భారీగా పెరిగాయి. కొత్త పంట చేతికొచ్చే వరకు పరిస్థితి ఇలానే ఉండేలా కన్పిస్తోంది. అంటే అక్టోబర్‌ నెలాఖరు వరకు సామాన్యులు టామాటా కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదు.