చైనా నుంచి దేశంలోకి అక్రమంగా వస్తే కాల్చేయండి : నార్త్ కొరియా డిక్టేటర్

వాస్తవం ప్రతినిధి: నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ జోంగ్ ఉన్.. ఆయన చేసే చేష్టలు, చర్యలు అన్నీ కూడా ఓ సంచలనమే. కిమ్ తాజాగా కరోనాను తనదైన శైలిలో కట్టడి చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. చైనా నుండి కరోనా వైరస్ కేసులు ఉత్తర కొరియాలోకి ప్రవేశించకుండా ఉండేందుకు కిమ్ జోంగ్ ఉన్ కాల్చేయండంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు దక్షిణ అమెరికా దళాల కమాండర్ వెల్లడించారు. కరోనా వ్యాప్తి నిరోధ చర్యల్లో భాగంగా సరిహద్దులో రెండు కిలోమీటర్ల మే ర బఫర్‌ జోన్‌ ఏర్పాటు చేసి..చైనా నుంచి దేశంలోకి అక్రమంగా రాకపోకలు సాగించేవారి కాల్చివేతకు ఆదేశాలిచ్చింది. ఇందుకోసం స్పెషల్‌ ఆపరేషన్స్‌ ఫోర్స్‌ (ఎస్‌వోఎ్‌ఫ)ను నియమించి వారికి ‘కాల్చివేత’కు ప్రత్యేక అధికారం ఇచ్చింది.

చైనాతో సరిహద్దుల్ని పంచుకున్నప్పటికీ ఆ దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అందులోనూ ఉత్తర కొరియాలో వైద్య సదుపాయాలు అంతంత మాత్రమే కావడంతో కరోనా కేసు చైనాలో బయటపడిన వెంటనే జనవరిలోనే కొరియా తన సరిహద్దుల్ని మూసేసింది. జూలైలో దే శంలో పూర్తిస్థాయి ఎమర్జెన్సీని విధించినట్లు అధికారిక మీడియా ప్రకటించింది. ఆ దేశంలో కరోనా కేసు నమోదైనట్లు ఇంతవరకు వివరాలు బయటకు రాలేదు. జూలైలో దేశ ఎమర్జెన్సీని గరిష్ట స్థాయికి పెంచినట్లు కొరియన్ మీడియా పేర్కొంది. ఇక బోర్డర్స్ మూసివేయడంతో స్మగ్లింగ్ వస్తువులకు డిమాండ్ పెరిగిందని.. దీనిపై అధికారులు జోక్యం చేసుకోవాలని యూఎస్ ఫోర్సెస్ కొరియా కమాండర్ రాబర్ట్ అబ్రమ్స్ అన్నారు.