డొనాల్డ్ ట్రంప్‌పై మండిపడ్డ కమలా హారిస్ ..!!

వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి, భారత సంతతి సెనెటర్ కమలా హారిస్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ట్రంప్ అమెరికన్లను కరోనా విషయంలో ఉద్దేశపూర్వకంగానే తప్పుదారి పట్టించారని మండిపడ్డారు. ప్రఖ్యాత ఇన్విస్టిగేటివ్ జర్నలిస్ట్ బాబ్ వూడ్వార్డ్స్ రాసిన రాబోయే పుస్తకం ‘రేజ్‌’లో వెల్లడైన ఈ విషయంపై యూఎస్ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలు దీనిని ధృవీకరిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె… “ట్రంప్ అమెరికన్లను కరోనా విషయంలో ఉద్దేశపూర్వకంగానే తప్పుదారి పట్టించారని విమర్శించారు. దేశ ప్రజలను కాపాడాల్సిన ఆయన అధ్యక్షుడిగా తన ప్రాథమిక విధిని కూడా సరిగ్గా నిర్వర్తించలేక పోయారని కమల దుయ్యబట్టారు. కాగా, ‘రేజ్‌’ బుక్ ఈ నెల 15న విడుదల కావాల్సి ఉంది. అయితే, విడుదలకు ముందే బుక్‌లో వూడ్వార్డ్స్… ట్రంప్ ప్రెసిడెన్సీ గురించి పేర్కొన్న కొన్ని విషయాలు కాంట్రవర్సీకి దారితీస్తున్న సంగతి తెలిసిందే.