మెగా ఫ్యాన్స్ కి చెక్కులు ఇచ్చిన రామ్ చరణ్..!!

వాస్తవం సినిమా: సెప్టెంబర్ రెండవ తారీకున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా మెగా అభిమానులు ఎప్పటిలాగానే రచ్చరచ్చ చేశారు. కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉన్నాగాని అభిమాన హీరో పుట్టిన రోజు వేడుకలు ఎక్కడా తగ్గకుండా చాలా ఘనంగా నిర్వహించారు. ఒక్క అభిమానులు మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో రాజకీయ నాయకులు అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు చాలా మంది ప్రముఖులు పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

ఇదిలా ఉండగా కుప్పంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ముందు రోజు ఒక బ్యానర్ కడుతున్న తరుణంలో కరెంట్ షాక్ తగిలి ముగ్గురు అభిమానులు చనిపోవటం మెగా హీరోలందరికీ ఎంతగానో బాధ కలిగించింది. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి ఎంతగానో తల్లడిల్లిపోయారు. అంతేకాకుండా చనిపోయిన అభిమానుల కుటుంబాలకి ఆర్థికంగా భరోసా ఇచ్చారు.

దీనిలో భాగంగా ఆనాడు ఘటన జరిగిన సమయంలో ప్రతి కుటుంబానికి రెండు పాయింట్ ఐదు లక్షలు ఇవ్వబోతున్నట్లు రామ్ చరణ్ స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ కుటుంబాలకు రామ్ చరణ్ చెక్కులు పంపించడం జరిగింది. అంతే కాకుండా ఇంకా కుటుంబానికి తోడుగా ఉంటామని రామ్ చరణ్ భరోసా ఇచ్చినట్లు టాక్.

గతంలో కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యాన్స్ అసోసియేషన్ కి చాలా విషయాలలో నాగబాబు అండ్ టీం వెనక ఉండి చాలా విషయాలకు సంబంధించి ఆదుకోవడం జరిగింది. అయితే తాజాగా ఈ ఘటనకు సంబంధించి సాయం చాలా వరకు త్వరగా రావటంతో మెగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.